2021 లో అభిమానులను ఫిదా చేసిన సినిమాలు ఇవే

2021 Best Movies : కరోనా తొలి వేవ్ తర్వాత సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన సినిమాలతో 2021 కొన్ని సినిమాలకు విజయాన్ని చేకూర్చి, వసూళ్ల వర్షం కురిపించాయి. అందులో ప్రధానంగా కొత్త హీరోల సినిమాలతో పాటు సీనియర్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఉప్పెన మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సానా బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కరోనా తోలివేవ్ తర్వాత వచ్చి సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఊపు తెచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ అయింది. హిందీ పింక్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ లకు లాభాలు పండించింది. అయితే సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా థియేటర్లు మూతపడడంతో డిస్ట్రిబ్యూటర్లు కొంత నష్టపోయారు. తమిళ మూవీ సేతుపతి రీమేక్ గా వచ్చిన క్రాక్ మూవీ మాస్ మహారాజ్ రవితేజకు సూపర్ హిట్ ఇచ్చింది. రవితేజ వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న నేపథ్యంలో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రవితేజను మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చింది.

అమెజాన్ లో రిలీజైన ‘ఏ’మూవీ కథనం అందరినీ ఆకట్టుకుంది. అయితే తగినంత ప్రమోషన్ వర్క్ లేకపోవడం మైనస్ అయింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన జాతి రత్నాలు మూవీ కామెడీ టచ్ తో ఆకట్టుకుంది. అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓటిటి ని షేక్ చేసింది. రాజరాజ చోర మూవీలో శ్రీవిష్ణు, ఆకాష్, సునైన, రవిబాబు తమ నటనతో మూవీని విజయ బాటలో నడిపించారు.

ఇక అఖండ మూవీ నందమూరి నటసింహం బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. బాలయ్య ద్విపా త్రాభినయం చేసిన ఈ మూవీలో అఘోర పాత్రల్లో అదరగొట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిల్చి కలెక్షన్స్ లో సైతం దూకుడు ప్రదర్శిస్తోంది.

గంధపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్ గా ఊర మాస్ క్యారెక్టర్ లో బన్నీ నటన అదరగొట్టింది. తగ్గేదిలే అంటూ ఫాన్స్ కిక్కించాడు. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ కల్సి తెరకెక్కించిన నాంది మూవీ అల్లరి నరేష్ కి మళ్ళీ హీరోగా లైఫ్ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని డిఫరెంట్ రోల్స్ తో డబుల్ యాక్షన్ లో చేసిన శ్యామ్ సింగరాయ మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

రాహుల్ తెరకెక్కించిన ఈ మూవీ విభిన్న పాత్రలతో నాని చేసిన నటన ఆకట్టుకుంటుంది. నాగచైతన్యలోని నటనను బయటకు తీసిన మూవీగా లవ్ స్టోరీ విజయాన్ని అందుకుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో సాయిపల్లవి నటన స్పెషల్ ఎట్రాక్షన్ అయింది.