MoviesTollywood news in telugu

షర్ట్‌లెస్‌గా కనిపిస్తున్న హీరోలు…ట్రెండ్ మారిందిగా…ఫాలో అవుతున్నారా…?

Six Pack Tollywood Actors : గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ మూవీలో చొక్కా లేకుండా కొన్ని సీన్స్ లో చేసి, తన బాడీని చూపించారు. అప్పట్లో ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో షర్ట్‌లెస్‌ హీరోలు కనిపిస్తున్నారు. మిర్చి మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేత ..కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌’ అనే డైలాగ్‌ పలికిస్తే, పాన్ ఇండియా స్టార్ గా వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చిన బాహుబలి మూవీలో లో షర్ట్‌లెస్‌ గా జక్కన్న చూపించాడు.

ఇక పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌ లో రాముడి పాత్ర చేస్తున్న ప్రభాస్‌ చొక్కా లేకుండా దర్శనమిస్తాడు. ఎందుకంటే పౌరాణిక పాత్రల్లో చొక్కలుండవు. టెంపర్‌ మూవీలో షర్ట్‌లెస్‌గా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్‌, తర్వాత అరవింద సమేత వీర రాఘవ మూవీలో కూడా అలాగే కన్పించాడు. ఇక జక్కన్న తీసిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో తారక్ తో పాటు రామ్ చరణ్ కూడా షర్ట్‌లెస్‌గా కనిపించిన దృశ్యాలు ట్రైలర్‌లో దర్శనమిచ్చాయి.

ఇప్పటికే చెర్రీ ధృవ మూవీలో షర్ట్‌లెస్‌గా కన్పించాడు. జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే. కాగా అర్జున్‌రెడ్డి మూవీలో కొన్ని సీన్స్‌లో షర్ట్‌లెస్‌గా కనిపించిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్‌ మూవీ కోసం బాక్సర్‌గా సిక్స్‌ప్యాక్‌తో షర్ట్‌లెస్‌ లో కన్పిస్తాడు.

ఆర్‌ఎక్స్‌100 లో సిక్స్‌ప్యాక్‌ బాడీతో కన్పించిన కార్తికేయ ఇప్పుడు తమిళంలో అజిత్‌ హీరోగా చేసిన యాక్షన్‌ మూవీ వలిమైలో కూడా షర్ట్ లెస్ గా మారాడు. ఈ మూవీలో కార్తికేయ విలన్‌ రోల్ చేస్తున్నాడు. అలాగే లవ్ మూవీస్ తో లవర్ బాయ్ గా కనిపిస్తూ వచ్చిన అక్కినేని అఖిల్‌ తాజాగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఏజెంట్‌ మూవీ కోసం షర్ట్‌లెస్‌గా మారాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."