బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” షో హిట్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసా?
balakrishna unstoppable show : నందమూరి నటసింహం బాలకృష్ణ యాడ్స్ కి దూరంగా ఉంటారు. అలాగే మిగిలిన హీరోల మాదిరిగా బుల్లితెర మీద వచ్చే రియాల్టీ షోస్ వంటి వాటిలో హోస్ట్ గా చేయడం లేదు. కానీ ఓటిటి లో హోస్ట్ గా చేసి ఆకట్టుకోవడంతో పాటు ఆహా ఓటిటి కి సబ్ స్క్రైబర్స్ పెరగడానికి దోహదం అయ్యాడు.
అయితే అన్‌స్టాపబుల్ షో పేరిట ఆహా ఓటిటి లో షోకి హోస్ట్ గా చేసి సక్సెస్ కావడం వెనుక బాలయ్య రెండవ కుమార్తె తేజస్విని కృషి ఉందట. ఈమె క్రియేటివ్ కన్సల్టెంట్ గా చేయడం వలన క్లిక్ అయిందని టాక్. ఆమె ఇచ్చిన సలహాలతోనే బాలయ్య హోస్ట్ గా సక్సెస్ అయ్యాడని అంటున్నారు.
ఇక ఈ షో కోసం ఎపిసోడ్ కి 25లక్షల చొప్పున 10ఎపిసోడ్లకు అగ్రిమెంట్ చేసుకోగా, ఇప్పుడు సీజన్ 1 షో హిట్ కావడంతో బాలయ్య తన తదుపరి సీజన్స్ నుంచి రెమ్యునరేషన్ కూడా పెంచే ఛాన్స్ ఉందని టాక్ విన్పిస్తోంది. మొత్తానికి హోస్ట్ గా క్లిక్ అవుతాడా లేదా అనుకుంటుంటే బాలయ్య అందరి అంచనాలను తారుమారు చేస్తూ, షో హిట్ చేయించడం విశేషం.