Healthhealth tips in telugu

పచ్చిమిర్చిని తినే వారు ఈ నిజాలను తెలుసుకోకపోతే…రిస్క్ లో పడినట్టే

Green Chillies Benefits in telugu :మనలో కొంతమంది పచ్చిమిర్చిని ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది పచ్చిమిర్చిని తినటానికి ఆసక్తిగా ఉండరు. పచ్చిమిర్చి వలన కలిగే లాభాలు,నష్టాలు గురించి వివరంగా తెలుసుకుందాం. సొలనేసి కుటుంబానికి చెందిన పచ్చిమిర్చి కాప్సికం తరగతికి చెందినది. పచ్చిమిర్చి మొదట అమెరికాలో వెలుగు చూసి ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాపించింది.
Green chilli
భారతదేశంలో పచ్చిమిర్చి గుంటూరు జిల్లాకు ప్రసిద్ధి చెందినది. పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటుంది. తెలుగు వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. పచ్చిమిర్చిని తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది.వీటిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. పచ్చిమిర్చిని వంటల్లో ఉపయోగిస్తారు. పచ్చిమిర్చిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
green chilli1
పచ్చిమిర్చిలో క్యాప్‌సైసిన్ వలన చాలా ఘాటుగా,కారంగా ఉంటుంది. మిరపకాయలన్నింటిలో కారం ఇచ్చే రసాయనం ‘కాప్సైసిస్‌‌’ అనే అల్కలాయిడ్‌ వుంటుంది. ఈ రసాయనానికి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మిరపలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
greem chilli2
మిరపలో కారంతోపాటు విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంది. చాలా మంది పచ్చిమిర్చిని వంటల్లో కేవలం కారం కోసమే వాడతారని అనుకుంటారు. కానీ పచ్చిమిర్చిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉండుట వలన  పోషకార నిపుణులు వంటల్లో ఎర్ర కారానికి బదులు పచ్చిమిర్చి వాడితే మంచిదని చెప్పుతున్నారు.
Green chilli3
పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించటమే కాకుండా క్యాన్సర్ కణాలను నిర్ములించి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్  ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. పచ్చిమిర్చిలో విటమిన్ సి ఎక్కువగా ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి  ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
green chilli4
విటమిన్ E సమృద్ధిగా ఉండుట వలన చర్మంలో నేచురల్ స్కిన్ ఆయిల్స్ ను ఉత్పత్తి చేసి చర్మం మెరిసేలా చేస్తుంది. పచ్చిమిర్చిలో కేలరీలు జీరో. ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో పచ్చిమిర్చి కొవ్వును బర్న్ చేయటంలో సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలింది. పచ్చిమిర్చిని రెగ్యులర్ గా పురుషులు తీసుకుంటూ ఉంటె ప్రొస్టేట్ క్యాన్సర్ బారీన పడకుండా ఉండటమే కాకుండా ప్రోస్టేట్ సమస్యలను దూరంగా ఉంచుతుంది.
Green chilli5
రక్తంలో చక్కర స్థాయిలను క్రమబద్దీకరణ చేస్తుంది. పచ్చిమిర్చిలో ఉండే పెప్పరిన్ తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి బాగా సహాయ పడుతుంది. పెప్పరిన్ అనేది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
Red Chilli
ఈ ఆమ్లం ప్రోటీనులు మరియు ఇతర ఆహారాలు జీర్ణం అవ్వడానికి చాలా అవసరం. ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్ మూడ్ ని ప్రభావితం చేస్తుంది. పచ్చిమిర్చి ఎండోర్ఫిన్స్ ఉత్పత్తికి కారణం అవుతుంది. అందువల్ల కారంగా ఉన్న ఆహారాలను తిన్నా తర్వాత మూడ్ చాలా బాగుంటుంది.