2021లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే

Tollywood Celebrities Who Got Marriage in 2021 : ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే సినిమా స్టార్స్ పెళ్లి విషయం మర్చిపోతూ ఉంటారు. కంగారు ఏముందిలే అనే జవాబు వస్తూ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారితో లాక్ డౌన్, కరోనా వేవ్స్ కారణంగా షూటింగ్స్ కి దూరంగా ఉండడంతో కొందరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. 2020లో రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెల్సిందే.

ఇక 2021లో మరికొందరు పెళ్ళిచేసుకుని సెటిల్ అయ్యారు. సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంది. మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో జనవరిలో పెళ్లి పీటలు ఎక్కింది. నిర్మాత ఎం ఎస్ రాజు కొడుకు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరిలో దీపిక అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. హీరో యిన్ ప్రణీత మేలో బెంగుళూరు బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్ ని పెళ్లి చేసుకుంది.

గౌరవ్ వంటి మూవీస్ లో చేసిన యామి గౌతమ్ ప్రముఖ డైరెక్టర్ ఆదిత్య దర్ ని పెళ్లాడింది. జబర్దస్త్ అవినాష్ అక్టోబర్ లో అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆర్ ఎక్స్ 100 మూవీతో ఎంట్రీ ఇచ్చి, వరుస మూవీస్ చేస్తున్న కార్తికేయ నవంబర్ లో అనితా రెడ్డి అనే అమ్మాయిని పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నాడు.