Healthhealth tips in telugu

టాబ్లెట్స్, టానిక్ లు వాడకుండా శరీరంలో రక్తాన్ని పెంచే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు

Iron Rich Foods : రక్తహీనత సమస్య ఉన్నప్పుడు తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. రక్తహీనత సమస్య తక్కువగా ఉన్నప్పుడు ఆహారంలో మార్పు ద్వారా ఆ సమస్య నుండి బయట పడవచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్లవలసిందే.

ఐరన్ సమృద్దిగా ఉండే పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి. బీట్ రూట్ రక్తం పెంచటానికి చాలా బాగా సహాయపడుతుంది.ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉండుట వలన శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి.

దానిమ్మ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానిమ్మలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరం, వాల్‌నట్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్ర రక్త కణాలు రక్తంలో వేగంగా పెరుగుతాయి. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే శరీరం ఎక్కువగా ఐరన్ శోషించుకోవటానికి సహాయపడుతుంది.

విటమిన్ సి,ఐరన్ సమృద్దిగా ఉన్న ఉసిరిని కూడా డైట్ లో బాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కనపడుతుంది. గుమ్మడి విత్తనాలలో కూడా ఐరన్ సమృద్దిగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన 25 శాతం ఐరన్ ని టమోటా అందిస్తుంది. కాబట్టి ఈ ఆహారాలను తీసుకుంటే ఐరన్ లోపం నుండి బయట పడవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."