అలనాటి హీరోయిన్ రాధ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
Tollywood senior actress radha : తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మూవీస్ లో 1980 దశకంలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన అందాల హీరోయిన్ రాధ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోందట. అది కూడా బుల్లితెరపై అడుగుపెట్టింది. నిజానికి ఒకప్పుడు హీరోయిన్స్ గా అదరగొట్టిన తారలు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంట్రీ ఇస్తూ పలు సినిమాలతో బిజీ అవుతున్నారు. లేదంటే బుల్లితెర సీరియల్స్ లో ఎంట్రీ ఇస్తున్నారు.
అత్తా, అమ్మ క్యారెక్టర్స్ తో బాగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. నిజానికి ఆమధ్య తమిళంలోని ఒక ఫేమస్ డ్యాన్స్ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ,తన సెకండ్ ఇన్నింగ్స్‌ను రాధ ప్రారంభించింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 4 సీజన్లు ఆ డ్యాన్స్ షోకు ఆమె జడ్జిగా కొనసాగింది.
ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత మరోసారి ఓ జూనియర్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా చేస్తోంది. తాజాగా ఈ షో ప్రోమో తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ షోకు తాను జడ్జి అవ్వడం చాలా గర్వంగా ఉందని రాధ చెప్పుకొచ్చింది. ఇక అప్పట్లో అగ్ర నటులందరి సరసన నటించి మెప్పించిన రాధ అప్పట్లో చిరంజీవి పక్కన నటిస్తూ ధీటుగా వేసిన స్టెప్స్ ఫాన్స్ ని ఉర్రూతలిగించేవి. చిరు, రాధ కాంబోలో సినిమా వస్తే చాలు సూపర్ హిట్ కొట్టేది. హీరోయిన్గా వెండితెరపై 10 ఏళ్ళు వెలిగినప్పటికీ అందరి మదిలో నిల్చింది.