Healthhealth tips in telugu

వీటిని ఉడికించి తింటే చాలు కొలెస్ట్రాల్, అధిక బరువు తగ్గటమే కాక డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది

Red Rice Benefits : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి వైట్ రైస్ తినడం మానేసి ముడి బియ్యం, కొర్రలు, అరికెలు వంటి వాటిని తింటున్నారు. అలాంటి వారికి ముడి బియ్యనికి బదులుగా రెడ్ రైస్ (Red Rice) తినడం మంచిది. ఈ ఎర్రబియ్యం అధిక బరువు,డయాబెటిస్ ఉన్నవారికి చాలా లాభాన్ని కలిగిస్తుంది.
red rice
ఈ బియ్యంతో అన్నం వండుకొని తింటే అధికంగా గ్లూకోజ్ రక్తంలో విడుదల కాదు. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువ కావని ఇటీవల జరిగిన పరిశోదనలో తేలింది. ఈ అన్నం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. నీరసం రాకుండా చురుకుగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మాటిమాటికీ కలిగే చిరు ఆకలి సమస్యను తగ్గిస్తుంది.
red rice 2
కాబట్టి, జంక్ ఫుడ్ పై మనసు వెళ్ళదు. ఎర్ర బియ్యానికి ఆ రంగు యాంతోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా వస్తుంది. ఈ అన్నం తినటం వలన శరీరానికి అవసరమైన ఐరన్ సమృద్దిగా అంది ఆక్సిజన్ సమస్థాయిలో శరీరానికి చేరి అలసట త్వరగా కలుగదు. ఇందులో ఉండే విటమిన్ బి6 ఎర్రరక్తకణాల సంఖ్య పెరగటానికి సహాయపడుతుంది. దాంతో రక్తహీనత సమస్య కూడా రాదు.
red rice 2
మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలో లావు బియ్యం, సన్న బియ్యం రెండు రకాలు ఉన్నాయి కనుక బిర్యానీ వంటివి కూడా వండుకోవచ్చు.
red rice 1
వీటి ధర కేజీ దాదాపుగా 120 రూపాయిలు ఉంటుంది. ఒక కప్పు ఎర్ర అన్నం తింటే 216 కెలోరీలు లభిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి. అయితే వీటిని మిగిలిన బియ్యంలా కాకుండా ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, సిమ్‌లో మెత్తగా ఉడికించి తినాలి.

ఐతే, దేన్నైనా అతిగా తీసుకుంటే మీకు అందులోంచి లభించే బెనిఫిట్స్ అనేవి మిస్సవుతాయి. పైగా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రెడ్ రైస్ ను కూడా మీరు మితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అరుగుదల సమస్య వస్తుంది. ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్ళండి.