Healthhealth tips in telugu

15 రోజులు అధిక బరువుతోపాటు రక్తహీనత,కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు లేకుండా చేస్తుంది

Carrot Weight Loss Tips :ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో పాటు అనేక రకాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అధికబరువు సమస్య నుంచి బయట పడటానికి క్యారెట్ చాలా బాగా సహాయపడుతుంది. క్యారెట్ లో విటమిన్ బి1, బి2, బి6లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవ్వులు , ప్రొటీన్లను జీర్ణం అయ్యేలా చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.
.Carrot
ఇందులో ఉండే బి విటమిన్ శరీరంలోని జీవక్రియ రేటును పెంచి కేలరీలు త్వరగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఇలా క్యాలరీలు వేగంగా ఖర్చు అవ్వటంతో కొవ్వు కరిగి బరువు బాగా తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ సహాయపడుతుంది. ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ముందు తీసుకుంటే బరువు తగ్గటమే కాకుండా రోజంతా అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉంటారు.

ఇందులో ఉండే ఐరన్ , ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలు, వత్తిడి సమస్యలు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు కూడా ఈ జ్యూస్ తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. క్యారెట్ లో ఐరన్ ఎక్కవగా ఉండటం వల్ల రక్తం వృద్ధి చెంది రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు.

క్యారెట్ ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. క్యారెట్ ముక్కలు,కొన్ని పుదీనా ఆకులు మిక్సీలో వేసి సరిపడా నీటిని పోసి మిక్సీ చేసి జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్ లో తేనె కలిపి తాగాలి. క్యారెట్ జ్యూస్ ని క్యారెట్ ఉడికించి కూడా చేసుకోవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నవారు క్యారెట్ ని ఉడికించి జ్యూస్ చేసుకోవాలి. పచ్చిగా తీసుకుంటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.