Beauty Tips

ఈ నూనెలో ఇది కలిపి పెదాలకు రాస్తే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

Dark Lips Home Remeides : ముఖం అందంగా ఉండాలంటే పెదాలు కూడా అందంగా ఉండాలి. పెదాలు అందంగా ఉండటానికి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది నల్లని పెదాలను గులాబీ రంగులోకి మరటానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో నల్లని పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి.
Dry lips beauty tips
నువ్వుల నూనె పెదాలపై నలుపును తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. నువ్వుల నూనెను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. అరస్పూన్ నువ్వులనూనెలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పెదాలకు రాసి పది నిమిషాలు అయ్యాక సాదరణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నలుపు క్రమంగా తగ్గుతుంది.

ఒక స్పూన్ నువ్వుల నూనెలో అరస్పూన్ కొబ్బరి నూనె కలిపి పెదాలకు రాయాలి. పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే పెదాల నలుపు క్రమంగా తగ్గి గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. మీకు లభ్యం అయిన దాన్ని బట్టి ఒక రెమిడీ ఫాలో అయితే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.