Healthhealth tips in telugu

1 గ్లాస్ తాగితే రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా పొట్టలో చెడు బ్యాక్టీరియాను తొలగించి శుభ్రం చేస్తుంది

Raavi Aaku Benefits : రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. అలాగే రావి చెట్టు కింద కూర్చోమని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఎందుకంటే రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ అందిస్తుంది. రావి ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెండు రావి ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి.
Raavi aaku
ఈ కషాయం తాగటం వలన ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా,పురుగులు తొలగిపోతాయి. ఇవి గ్యాస్ ఏర్పడటానికి,కడుపునొప్పికి కారణం అవ్వటమే కాకుండా పిల్లల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. పొట్టను శుభ్రం చేస్తుంది. రావి ఆకులో flavonoids, piperine, piperlangumine సమృద్దిగా ఉండుట వలన శరీరంలో ఎక్కువ యాంటీబాడీలను ఉత్పత్తి చేసి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

ఈ కషాయం ఫిట్స్‌ తీవ్రతను తగ్గించటానికి సహాయపడుతుంది. మన శరీరంలో సెరోటోనిన్ వంటి రసాయనాలు న్యూరోట్రాన్స్‌మిటర్‌లుగా పనిచేస్తాయి. న్యూరోట్రాన్స్‌మిటర్‌ యొక్క కార్యాచరణను మెరుగుపరచటం ద్వారా పిట్స్ ని తగ్గిస్తుంది. దగ్గు, కఫం, శ్లేష్మం మరియు ఉబ్బసం ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

రావి ఆకులలో ఫినోలిక్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లుగా పనిచేసి నోటిలో, పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.