వీటిని తింటే రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది
Bad cholesterol Foods : మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉన్నాయి. వీటిని మంచి మరియు చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. కణాల నిర్మాణానికి మరియు విటమిన్లు మరియు ఇతర హార్మోన్లను తయారు చేయడానికి మంచి కొలెస్ట్రాల్ సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె పోటు మరియు స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి.

మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ వ్యాయామం చేయాలి. ఆహారంలో పప్పులను చేర్చుకోవాలి. అన్ని రకాల పప్పులలో సంతృప్త కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండుట వలన కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడతాయి. బాదం పప్పు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది, ఇది గుండెను ఫిట్‌గా ఉంచుతుంది.
అలాగే ఓట్స్ కూడా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి సహాయపడుతుంది. రోజుకి 4 బాదం పప్పులు, రోజుకి ఒక రకం పప్పును ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ ని తీసుకోవచ్చు. రోజు తీసుకోవటం ఇబ్బందిగా ఉంటే మాత్రం వారంలో మూడు సార్లు తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి.
ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకొని దాన్ని బట్టి అవసరమైతే మందులు కూడా వాడాలి. అలా మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటే తొందరగా మంచి ఫలితం వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

