కాకరకాయతో తయారుచేసిన టీ తాగితే… ఊహించని లాభాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Bitter gourd tea benefits In telugu : మనలో చాలా మంది కాకరకాయ అంటే ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉండడమే అందుకు కారణం. అయితే కాకరకాయ ఎన్నో పోషకాలను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాకరకాయ తినని వారు కాకరకాయతో టీ తయారు చేసుకుని తాగితే సరిపోతుంది.

ఈ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కాకరకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఈ ఎండిన కాకరకాయ ముక్కలను నిలవ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నీటిని పోసి కొన్ని ఎండిన కాకరకాయ ముక్కలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం., ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి.

డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తేనే వాడకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. శరీరంలోని విషాలను తొలగించి అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. .

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. ప్రతిరోజు కాకరకాయతో తయారుచేసిన టీ తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి..

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.