Beauty Tips

పగిలిపోయి, నల్లగా మారిన పెదాలపై ఈ పేస్ట్ రాస్తే మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి

Home Remedy for Dry Lips : పెదాలు పొడిగా మారినప్పుడు పగుళ్లు వస్తూ ఉంటాయి. అలాగే పెదాల పగుళ్ళ కారణంగా పెదాలు నల్లగా మారతాయి. పెదాలు పగుళ్లు లేకుండా ఎర్రగా ఉంటేనే ముఖానికి అందం. పెదాలు పగిలినప్పుడు లిప్ బామ్ వంటివి వాడవలసిన అవసరం లేదు. ఇంటిలోనే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.
Dry lips beauty tips
పెదాల పగుళ్లు,నలుపును తగ్గించటానికి కొత్తిమీర చాలా బాగా సహాయపడుతుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ A ఉండుట వలన హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పెదాలు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. కొత్తిమీరను మెత్తని పేస్ట్ గా తయారుచేసుకొని పెదాలపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.

పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి నూనెను తీసుకొని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే పెదాల పగుళ్లు,నలుపు తగ్గి మృదువుగా కాంతివంతంగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.