Healthhealth tips in telugu

ఐరన్ పెంచే 10 ముఖ్యమైన ఆహారాలు… మీరు తింటున్నారా…?

Top 10 iron rich foods iron deficiency In Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తుంది. మన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి హిమోగ్లోబిన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ తయారుచేయటానికి ఐరన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది.
blood thinning
శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత సమస్య కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అందువల్ల రక్తహీనత సమస్యలు లేకుండా చూసుకోవాలి. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఆహారం ద్వారా మనం ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.

సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే తొందరగా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. గుడ్లు,చేపలు, బీన్స్, పాలకూర, మునగాకు, చిలకడ దుంప, బ్రకోలి, బటాని, శనగలు,బీట్ రూట్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ అంది రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది.

మాంసాహారం తినే వారైతే వారంలో రెండు సార్లు తీసుకోవాలి. అప్పుడు రక్తహీనత సమస్య ఉండదు. ఎప్పుడైనా సరే మన ఆహారంలో మార్పులను చేసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.