Healthhealth tips in telugu

కండరాల తిమ్మిర్లు,నొప్పులు, మజిల్ క్రాంప్స్ ని తగ్గించే ఆకు…అందరికీ తెలిసిన మొక్కే…అసలు నమ్మలేరు

Muscle cramps :ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా పారిజాతం మొక్కను ఇంటిలో పెంచుకుంటున్నారు. పారిజాతం పూలను దేవుని పూజకు వాడుతూ ఉంటారు. పారిజాతం ఆకు,పువ్వు,వేరు,కాండం ఇలా ఈ మొక్కలో అన్నీ బాగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉప యోగిస్తారు. రెండు పారిజాతం ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి.
parijat leaves
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కడిగిన పారిజాతం ఆకులను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మూడు నిమిషాల పాటు మరిగిస్తే ఆ ఆకులోని పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో తాగాలి. ఈ విధంగా తాగటం వలన కండరాల నొప్పులు, కండరాల తిమ్మిరి, మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి.

అలాగే ఈ నీటిని తాగటం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే అజీర్ణం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ నీటిని తాగటానికి అరగంట ముందు ఏమి తీసుకోకుండా ఉంటే మంచిది. పారిజాతం ఆకులు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. పారిజాతం ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఆ పొడిని కూడా వాడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.