Healthhealth tips in telugu

కాకరకాయ+నిమ్మరసం కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా?

Bitter gourd And Lemon Benefits : కాకరకాయ,నిమ్మరసంలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకరకాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ లో అరచెక్క నిమ్మరసం పిండి తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే మందులు జీవిత కాలం వాడవలసిందే. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కాకరలో ఉండే పాలిపెప్టైడ్ పి అనేది ఇన్సులిన్ గా పనిచేసి, రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది.ఈ జ్యూస్ తాగటం వలన కాలేయం శుభ్రం అవ్వటమే కాకుండా రక్తం కూడా శుద్ది అవుతుంది.

ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వయస్సు పెరిగే కొద్ది చర్మంలో వచ్చే మార్పులను తగ్గిస్తుంది. అలాగే వాపులు, గడ్డలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి మంచి ప్రయోజనం కలిగిస్తుంది.

ఈ జ్యూస్ లో ఉండే ఫోలిక్ ఆమ్లం గుండెకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే ఈ జ్యూస్ ఎప్పుడు తాగితే మంచిదో చూద్దాం. సాధారణంగా ఉదయం పరగడుపున ఇటువంటి జ్యూస్ లను త్రాగాలి. అయితే గ్యాస్, అసిడిటీ సమస్యతో బాధపడే వారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత త్రాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.