అర చేతులు,అరికాళ్ళల్లో వచ్చే తిమ్మిర్లు,మంటలు నిమిషంలో తగ్గి…జీవితంలో అసలు ఉండవు

How to stop leg cramps immediately : అర చేతులు,అరికాళ్ళల్లో తిమ్మిర్లు అనేవి సాదరణమే. తిమ్మిర్లు వచ్చినప్పుడు సూదులతో గుచ్చినట్టు,తిమ్మిరి వచ్చిన బాగం స్వాధీనంలో లేకపోవటం,జివ్వుమని లాగినట్టు ఉండటం వంటివి ఉంటాయి. ఎక్కువసేపు అలా కదలకుండా కూర్చున్నా కూడా తిమ్మిర్లు వస్తాయి.
sompu
ఇలా తిమ్మిర్లు వచ్చినప్పుడు లేచి నాలుగు అడుగులు వేస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అలా కాకుండా ఎక్కువ రోజులు తిమ్మిర్లు ఉంటే మాత్రం అసలు అశ్రద్ద చేయకూడదు. తిమ్మిర్లను అశ్రద్ద చేస్తే అది నరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో,నరాలు ఒత్తిడికి గురి అయినప్పుడు.నరాల్లో రక్తప్రసరణ సరిగా జరగనప్పుడు తిమ్మిర్లు వస్తాయి.

ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు బాగానే పనిచేస్తాయి. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను పాటిస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. సొరకాయను సర్కిల్ గా కట్ చేసి గాటులు పెట్టాలి. ఈ సొరకాయ ముక్కతో తిమ్మిర్లు ఉన్న ప్రదేశంలో రుద్దాలి. ఈ విధంగా రాత్రి పడుకొనే ముందు చేస్తే నిద్ర బాగా పడుతుంది.

పచ్చి ధనియాలు లేదా సొంపు, పటిక బెల్లం సమాన మోతాదులో తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం అరస్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఈ విధంగా నెల రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.