ఇలా చేస్తే చాలు పంటి నొప్పి,చిగుళ్ళ వాపు,పంటి ఇన్ ఫెక్షన్,పిప్పి పన్ను అనేవి జీవితంలో ఉండవు
Tooth infections : మనలో చాలా మంది ఎన్నో రకాల దంతాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఓక రకంగా చెప్పాలంటే నూటికి 80 శాతం మంది పంటి నొప్పి,చిగుళ్ళ వాపు,పంటి ఇన్ ఫెక్షన్,పిప్పి పన్ను వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే పంటి మీద ఏనామిల్ దెబ్బతిని సెన్సిటివ్ గా మారిపోవడం కూడా జరుగుతుంది.

ఈ సమస్యలను తగ్గించటానికి కరక్కాయ చాలా బాగా సహాయపడుతుంది. కరక్కాయను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కరక్కాయలో అరబింనో గెలాక్టిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉండుట వలన నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. మార్కెట్లో కరక్కాయలు విరివిగానే లభ్యం అవుతాయి. అలాగే కరక్కాయ పొడి కూడా దొరుకుతుంది.
కరక్కాయ పొడితో నోట్లో వేలు తోనే లేదా బ్రష్ తో కాని పళ్ళపొడితో బ్రష్ చేసుకున్నట్లుగా చేసుకుంటే సరిపోతుంది. లేదా కరక్కాయను ముక్కలుగా కట్ చేసి నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ తో పళ్లను తోముకుంటే పంటికి సంబందించిన సమస్యలు ఉండవు. పూర్వ కాలంలో దంత సమస్యలకు ఎక్కువగా కరక్కాయను ఉపయోగించేవారు.
కరక్కాయ పొడి లేదా పేస్ట్ తో దంతాలను తోముకోవటం వలన పంటి నొప్పి,చిగుళ్ళ వాపు,పిప్పి పన్ను,పంటి ఇన్ ఫెక్షన్, నోటిలో బ్యాక్టీరియా తొలగిపోవటమే కాకుండా నోటి దుర్వాసన కూడా ఉండదు. కాబట్టి కరక్కాయను ఉపయోగించి పంటి సమస్యల నుండి సులభంగా బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

