Healthhealth tips in telugu

వందల రోగాలని నయం చేసే పేదోడి గంజి అన్నం…సంజీవని వంటిది

Ganji annam benefits : గంజి అన్నం తింటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మన పూర్వీకులు ఈ గంజి అన్నంను తిని ఏ అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు మరల ప్రాచుర్యంలోకి వచ్చింది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఈ గంజి అన్నం వేసవిలోనే కాకుండా అన్నీ కాలాల్లోనూ సంజీవినిగా పనిచేస్తుంది. గంజి అన్నం తయారుచేసుకోవటానికి ముందుగా అన్నం వండుకోవాలి. ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు బియ్యనికి నాలుగు కప్పుల నీటిని పోసి ఉడికించాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత అన్నం నుండి గంజిని వేరు చేయాలి.

ఉడికించుకున్న అన్నంను మట్టి కుండలో వేసి రెండు కప్పుల నీరు,రెండు కప్పుల గంజి వేసి బాగా కలపాలి. అలాగే అర టీ స్పూన్ వామును నలిపి వేసుకోవాలి, ఇందులోనే రెండు కప్పుల పల్చటి మజ్జిగ కూడా పోసుకోవాలి. ఆతర్వాత సరిపడా రాళ్ళ ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి కలపాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తినాలి. ఈ విధంగా తింటే శరీరానికి చలవ చేసే మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఇది శరీరానికి అమృతం వంటి ఆహారం అని చెప్పవచ్చు. పొట్టకు సంబందించిన అన్నీ రకాల సమస్యలు తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."