శనగపిండిలో వీటిని కలిపి ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది…ఎలానో చూసి ట్రై చేయండి

Hair Fall Tips : జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జుట్టు రాలకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ వాడితే సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
Hair Care
ఈ చిట్కాకి వాడే ఇంగ్రిడియన్స్ అన్ని సహజసిద్ధమైనవే. అంతేకాక మన ఇంటిలో సులువుగా అందుబాటులో ఉండేవే. ఈ చిట్కా జుట్టు వేగంగా పెరగటానికి సహాయపడుతుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు గ్రోత్ కావటానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ చిట్కా కోసం కావలసిన ఇంగ్రిడియన్స్, ఎలా తయారుచేయాలో వివరంగా తెలుసుకుందాం.
besan
మొదటి ఇంగ్రిడియన్ శనగపిండి
శనగపిండి సౌందర్య పోషణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. శనగపిండి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. శనగపిండిని తలకు అప్లయ్ చేసినప్పుడు తలలో రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పొడవుగా,ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
Eating raw onion with meals health benefits telugu
రెండో ఇంగ్రిడియన్ ఉల్లిపాయ
ఉల్లిపాయ సౌందర్య పోషణలో చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాక జుట్టు రాలిన స్థానంలో కొత్త జుట్టు గ్రోత్ కావటానికి సహాయపడతుంది.
weight loss tips in telugu
మూడో ఇంగ్రిడియన్ పెరుగు
పెరుగు జుట్టుకు పోషణను అందించి జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఈ మూడు ఇంగ్రిడియన్స్ ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.
Onion beaUTY tIPS
ఒక బౌల్ తీసుకోని ఒక స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి. ఆ తరవాత ఒక స్పూన్ శనగపిండి వేసి కలపాలి. ఆ తరవాత పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు రాసి ఒక గంట తర్వాత సాధారణమైన నీటితో జుట్టును శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానముచేయాలి . ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కాను తప్పనిసరిగా ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సమస్యల నుండి బయట పడతారు. మీరు రెండు నెలల పాటు ఈ చిట్కాను ఫాలో అయితే మంచి రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.