ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి
How to whiten teeth at home : పళ్ళు అందంగా మెరిసేలా ఉండాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ట్రీట్ మెంట్ చేయించుకోవలసిన అవసరం లేదు. మన ఇంటి చిట్కాలతో సులభంగా గార పట్టిన, పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం టమోటా రసం తీసుకోవాలి. పళ్లను తెల్లగా మార్చటానికి అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ టమోటాలో ఉంటుంది.
ఒక బౌల్ లో మూడు స్పూన్ల టమోటా రసం, అరస్పూన్ తురిమిన అల్లం, రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమంను బ్రష్ సాయంతో పళ్లను తోమాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేయాలి. ఈ మిశ్రమంను ఫ్రిజ్ లో పెడితే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.నోటి ఆరోగ్యానికి మరియు దంతాలు తెల్లబడటానికి ఇది శక్తివంతమైన నివారణగా పనిచేస్తుంది. అల్లం చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది, పంటి నొప్పులను దూరం చేస్తుంది మరియు నోటి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
నోటి ఆరోగ్యానికి మరియు దంతాలను తెల్లగా మార్చటానికి అల్లంలో ఉండే రాఫినోస్ మరియు జింజెరాల్ సహాయపడతాయి. పంటి మీద ఫలకం ఏర్పడకుండా రక్షణ కోసం రాఫినోస్, దంతాలు మరియు చిగుళ్ల చుట్టూ బ్యాక్టీరియా ఏర్పడకుండా ఇన్ ఫెక్షన్ తో పోరాటం చేయటానికి జింజెరాల్ సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.