Healthhealth tips in telugu

గ్లాస్ పాలల్లో 1 స్పూన్ కలిపి తాగితే రక్తహీనత,మలబద్దకం,కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు ఉండవు

Fennel Seeds Milk benefits: ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్య తగ్గాలన్నా ఇప్పుడు చెప్పే పాలను ప్రతి రోజు తాగితే సరిపోతుంది. ఈ పాల కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
fennel Seeds Benefits In telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ సొంపు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. అప్పుడే సొంపులో ఉండే పోషకాలు పాలల్లోకి చేరతాయి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆర్గానిక్ బెల్లం వేసి 2 నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచి ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి పాలను వడకట్టి తాగాలి.

ఈ పాలను ప్రతి రోజు తాగుతూ ఉంటే రక్తహీనత,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా ప్రతి రోజు తాగుతూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కండరాల నొప్పులను తగ్గించటానికి కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాగే కంటికి సంబందించిన సమస్యలు ఉండవు. రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతి రోజు తాగితే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య ఉండదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.