Healthhealth tips in telugu

ఈ టీ తాగితే నరాల బలహీనత,చేతులు,కాళ్ళ వణుకు సెకండ్స్ లో తగ్గిపోతాయి

Maruvam Tea benefits In telugu : వయస్సు పెరిగే కొద్ది కొంతమందిలో నరాల బలహీనత,చేతులు,కాళ్ళు వణకటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయట పడటానికి ఒక టీ గురించి తెలుసుకుందాం. మరువంతో టీ తయారుచేసుకోవాలి. మరువం అంటే మనలో చాలా మందికి తెలుసు. పూల మాలల మధ్య మరువం వేసి మాల కడుతూ ఉంటాం.

అయితే మరువంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ విషయం మనలో చాలా మందికి తెలియదు. మరువం టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో 15 నుంచి 20 మరువం ఆకులను వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె వేసుకొని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగుతూ ఉంటే నరాల బలహీనత,చేతులు,కాళ్ళ వణుకు క్రమంగా తగ్గుతాయి. రక్తప్రసరణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ టీ ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించి నరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

మరువంలో శోధ నిరోధక లక్షణాలు ఉండుట వలన సైనస్ తలనొప్పి, శారీరక నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు, మైగ్రేన్‌లు, పంటి నొప్పి మరియు ఉబ్బసం వంటి సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. శక్తివంతమైన సహజ యాంటీ-ఆక్సిడెంట్‌లలో ఒకటైన ఆస్కార్బిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.