తలలో చుండ్రు,దురద, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్స్ అన్నింటిని మాయం చేసే నూనె

Home Made Hair Oil : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. చుండ్రు సమస్య ఒక్కసారి వచ్చిందంటే తొందరగా తగ్గదు. అందువల్ల చుండ్రు ప్రారంభ దశలో ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. చుండ్రు సమస్య వచ్చిందంటే దురద,ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.

ఈ సమస్యలు వచ్చాయంటే జుట్టు రాలే సమస్య కూడా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు తలలో చుండ్రు,దురదలు, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్స్ వంటి వాటిని తగ్గించటానికి ఒక నూనెను తయారుచేసుకుందాం. ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
cococnut Oil benefits in telugu
ఒక గిన్నెలో అరకప్పు కొబ్బరి నూనె, అరకప్పు నువ్వుల నూనె, గుప్పెడు వేపాకులు, ఒక స్పూన్ మెంతులు, మూడు స్పూన్ల ఉసిరి ముక్కలు వేసి మరిగించాలి. బాగా మరిగిన ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
White Hair Tips In Telugu
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తలలో చుండ్రు,దురదలు, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్స్ వంటివి అన్నీ తగ్గిపోయి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ సహజసిద్దమైనవి.
neem Leaves
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడవచ్చు. ఉసిరి, మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. వేపాకులలో ఉన్న లక్షణాలు తల మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ నూనెను వాడి ఇప్పుడు చెప్పిన అన్నీ సమస్యల నుండి బాయ్త పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.