పాలకూరతో ఇలా చేస్తే చాలు ఆస్తమాకు చెక్ పెట్టవచ్చు…జీవితంలో ఉండదు

Asthma remedies in telugu : ఆస్తమా ఒక్కసారి వచ్చిందంటే తగ్గటం చాలా కష్టం. చలికాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో ఊపిరి సరిగా ఆడక చాలా ఇబ్బంది పడిపోతు ఉంటారు. ఆస్తమా రావటానికి అనేక కారణాలు ఉన్నప్పటికి దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కామన్ గా ఉండే లక్షణాలు.
asthama
ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మందులు వేసుకుంటున్నా ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. ఇది ప్రాణాంతకం కాక పోయినా,తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ వ్యాధి పూర్తిగా తగ్గదు. ఉపశమనం కోసం మాత్రమే మందులు ఉంటాయి.

ఆస్తమా నియంత్రణలో ఉంచటానికి ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఆస్తమా కోసం మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే ఈ సీజన్ లో ప్రశాంతంగా ఉండవచ్చు. ఈ సీజన్ లో ఆకుకూరలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. పాలకూర ఆస్తమా ఉపశమనం కోసం చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పాలకూరలో విటమిన్ లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. పాలకూరలో ఫోలేట్ చాలా సమృద్దిగా ఉంటుంది. ఆస్తమా ఉన్నవారికి ఫోలేట్ చాలా ముఖ్యమైనది. ఇది ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బీటా కెరోటిన్ సమృద్దిగా ఉండుట వలన ఆస్తమా నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

పాలకూరను వారంలో రెండు సార్లు తప్పనిసరిగా తీసుకోవాలి. పాలకూరతో పప్పు చేసుకోవచ్చు. లేదంటే జ్యూస్ గా చేసుకొని తాగవచ్చు. పాలకూరలో ఉండే పోషకాలు ఆస్తమా లక్షణాలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడతాయి. కాబట్టి ఈ సీజన్ లో ఆస్తమా ఉన్నవారు ఆహారం విషయంలో శ్రద్ద పెట్టాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.