Healthhealth tips in telugu

కీర దోస తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో…

keera dosakaya benefits in telugu : కుకుమిస్ సటైవస్ కుటుంబానికి చెందిన కీర దోసను ప్రాచీన కాలం నుండి మన దేశంలో వాడుతున్నారు.  కీర మొక్కలో కాయ, గింజలు, వేర్లను ఔషధంగా వాడతారు. కీర దోసను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తక్కువ ధరతో ఎప్పుడు లభ్యం అయ్యే కీర దోసలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

కీర దోసలో కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, విటమిన్‌ సి, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, బయోటిన్‌, విటమిన్‌ బి1 సమృద్ధిగా ఉంటాయి. కీర దోసలో 95 శాతం నీరు ఉండుట వలన డీహైడ్రేషన్ సమస్య రాకుండా చేయటమే కాకుండా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. కీర దోసను సాధ్యమైనంత వరకు పై తొక్క తీయకుండా తింటేనే మంచిది. 

ఎందుకంటే కీర దోస తొక్కలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. రోజులో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి 10 శాతంవరకు కీర దోస అందిస్తుంది.కీర దోసలో ఉన్న లవణాలు గోళ్లు చిట్లకుండా బలంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. కళ్ళు అలసటకు గురి అయినప్పుడు లేదా కళ్ళు ఎర్రగా అయినప్పుడు కీర దోసను చక్రాలుగా ముక్కలు కోసి కంటి మీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గటమే కాకుండా కంటి కింద నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. అంతేకాక కంటి కింద ఉబ్బు కూడా తొలగిపోతుంది.
gas troble home remedies
కీర దోస జీర్ణక్రియ బాగా జరిగేలా ప్రోత్సహించి గ్యాస్,అసిడిటీ ,కడుపులో మంట వంటి వాటిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.కీర దోస తొక్కలో విటమిన్ K ఉండుట వలన చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గాలని అనుకునేవారు రెగ్యులర్ గా కీర దోసను తింటే మంచి ఫలితం కనపడుతుంది.
kidney problems
కిడ్నీలో రాళ్లు కరగటానికి సహాయపడుతుంది. కీర దోసలో ఉండే బి విటమిన్లు ఆందోళనను తగ్గించి ఒత్తిడి నుంచి రక్షణ కల్పిస్తాయి. దాహం వేసినప్పుడు నీరు అందుబాటులో లేకపోతే కీరా దోసను తిని దాహం తీర్చుకోవచ్చు. ప్యాంక్రియాస్‌ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు.
Brain Foods
కీర దోసలో ఉండే విటమిన్ K న్యూరాన్ల పనితీరు మెరుగుపరుస్తుంది. దాంతో వయస్సు రీత్యా వచ్చే అల్జీమర్స్‌ వ్యాధి ప్రభావం తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.కీర దోసలో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫాలీఫినాల్స్, ఫైటో న్యూట్రీయంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

కీరదోసకాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. హైబిపి, లోబిపి రెండింటిని కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.