Healthhealth tips in telugu

రాత్రి పడుకొనే ముందు 1 గ్లాస్ తాగితే గ్యాస్,అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు జీవితంలో ఉండవు

Constipation Home Remedies in telugu : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం, కొన్ని రకాల మందులను వాడటం, రోజుల్లో తగినంత నీటిని తాగక పోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో ఈ మలబద్ధకం సమస్య అనేది చాలా తీవ్రంగా వేధిస్తోంది.
dhaniyalu
ఈ సమస్య పరిష్కారానికి మన ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో టీ తయారు చేసుకుని రాత్రి పడుకోవడానికి ముందు తాగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మిక్సీ జార్ లో ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ సోంపు, అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదా పావు స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకుని మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి.
sompu
ఈ పొడిని ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడెక్కాక పైన తయారు చేసుకున్న పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టే రుచికి పటిక బెల్లం పొడి కలుపుకొని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు పట్టిక బెల్లం పొడి లేకుండా తీసుకోవాలి. .
Dalchina chekka for weight loss
ప్రతిరోజు రాత్రి పడుకోవటానికి ముందు ఒక గ్లాసు ఈ డ్రింక్ తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్ధకం సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అంతే కాకుండా గ్యాస్., ఎసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి అన్ని రకాల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణసంబంధ సమస్యలు ఏమైనా ఉంటే అది మన ఆరోగ్యం మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
gas troble home remedies
కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం పరిష్కారం వైపు అడుగులు వేయాలి. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీర్ణ సంబంద సమస్యల నుండి బయట పడవచ్చు. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే ఎటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.