ఈ పేస్ట్ జుట్టుకి పట్టిస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Beetroot Hair Growth Tips in telugu : జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరగాలని మనలో చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంది మానసికంగా కృంగిపోతూ ఉంటారు.
hair fall tips in telugu
ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒక బౌల్ లో రెండు స్పూన్ల మెంతులను వేసి దానిలో నీటిని పోసి 5 గంటలు నానబెట్టాలి. మిక్సీ జార్ లో నానిన మెంతులు, రెండు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల అలోవెరా జెల్, రెండు స్పూన్ల ఉసిరి పొడి, చిన్న బీట్రూట్ ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి.
curd benefits in telugu
ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. ఒక గంట తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ లోనూ ఉన్న పోషకాలు జుట్టుకు తేమను అందించి పొడిగా మారకుండా చేస్తాయి.
fenugreek seeds
అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
మెంతులు జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణను బాగా పెంచుతాయి. అలాగే మంచి హెయిర్ కండిషనర్ గా పనిచేస్తుంది. పెరుగులో ఉన్న పోషకాలు జుట్టును మృదువుగా ఉండేలా చేస్తుంది.
kalabanda beauty
అలోవెరా జెల్ లో ఉన్న లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉసిరి పొడి కూడా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో ఈ ప్యాక్ వేసుకొని జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.