కాబూలీ శనగలు Vs నల్ల శనగలు…ఏది తింటే మంచిది…నమ్మలేని నిజాలు
kala Chana Vs kabuli Chana : కాబూలీ శనగలు మరియు నల్ల శనగలు రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది తింటే మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం. కాబూలీ శనగలు మరియు నల్ల శనగలు రెండూ మనకు చాలా సులభంగానే చాలా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటాయి.
100 గ్రాముల నల్ల శనగల్లో ప్రోటీన్ అనేది 7 నుండి 8 గ్రాములు ఉంటే…కాబూలీ శనగలలో 10 నుంచి 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు వారంలో రెండు సార్లు శనగలను తినవచ్చు.
ఐరన్ మరియు కాల్షియం అనేవి నల్ల శనగలతో పోలిస్తే కాబూలీ శనగలలో ఎక్కువగా ఉంటుంది.ఎముకలు దృఢంగా, బలంగా,ఆరోగ్యంగా ఉండాలంటే కాబూలీ శనగలు తీసుకోవాలి. శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ సమస్యలను తగ్గించుకోవాలంటే శరీరానికి కాల్షియం అవసరం.
గుండె సమస్యలను తగ్గించటానికి నల్ల శనగలు కంటే కాబూలీ శనగలు మంచివి.ఎందుకంటే కాబూలీ శనగలలో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు సెలీనియం వంటివి సమృద్దిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. కాబూలీ శనగలలో కొలెస్ట్రాల్ అసలు ఉండదు.
మలబద్దకం సమస్య ఉన్నవారికి కూడా కాబూలీ శనగలు బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మలబద్దకం సమస్య తగ్గాలంటే ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. 100 గ్రాముల కాబూలీ శనగల్లో 18 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటే…నల్ల శనగల్లో 13 గ్రాముల డైటరీ ఫైబర్ మాత్రమే ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా కాబూలీ శనగలు మంచి ఆహారం అని చెప్పాలి.
ఎందుకంటే నల్ల శనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 13 ఉంటే…కాబూలీ శనగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ 8 ఉంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాలి. కాబట్టి కాబూలీ శనగలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. అలా అని నల్ల శనగలను తినటం మానవలసిన అవసరం లేదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.