గోధుమలకు బదులుగా వాడితే…ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు
Buckwheat benefits In Telugu : Buckwheat పిండి గురించి మనలో చాలా మందికి తెలియదు. మంచి రుచి కలిగిన ఈ పిండి ఒక పండ్ల విత్తనం నుండి తయారవుతుంది. సాధారణ గోధుమ పిండికి జిగురు లేని ప్రత్యామ్నాయమే ఈ పిండి. Buckwheat పిండి సూపర్ మార్కెట్ లో లభ్యం అవుతుంది.

Buckwheat పిండిని కుట్టు పిండి అని పిలుస్తారు. గోధుమపిండికి ప్రత్యామ్నాయంగా వాడతారు. ఈ పిండితో రొట్టెలు,దోసలు వంటి వాటిని చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పిండిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా, గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఈ పిండిని Super Food గా చెప్పుతారు.

Buckwheat తృణధాన్యం కాకపోయిన…ఒక తృణధాన్యం వలె చెప్పుతారు. దీనిలో రుటిన్ అనే ఫైటోన్యూట్రియెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో కూడా బాగా సహాయపడుతుంది.

దీనిలో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులు లేకుండా చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. దీనిలో 12 రకాల అమైనో ఆమ్లాలు ఉండుట వలన కండరాల బలానికి మరియు పెరుగుదలకు సహాయపడుతుంది. జింక్ మరియు సెలీనియం ఉండుట వలన వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకల సమస్యలను తగ్గిస్తుంది.

ఈ పిండిలో విటమిన్ ఇ మరియు మెగ్నీషియం ఉండుట వలన ఇవి రెండూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి శ్వాసనాళాలు వాపును తగ్గించి ఆస్తమా నివారణలో సహాయపడుతుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. Buckwheat లో ఉండే ఫ్లేవనాయిడ్‌లు, టోకోఫెరోల్స్, సెలీనియం మరియు ఫెలోనిక్ యాసిడ్ లు వ్యవస్థ నుండి ఫ్రీ రాడికల్ ఏజెంట్‌లను నిర్మూలించి వ్యాధులు మరియు ఇన్‌ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. ప్రేగు కదలికల పనితీరు మెరుగుపరచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది.

కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గుతారు. బరువు టాగ్గాలని అనుకొనే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. గోధుమలను ఎలా ఉపయోగిస్తామో ఈ Buckwheat ను కూడా అలానే ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

