కాలీఫ్లవర్ Vs బ్రకోలీ…ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు
Cauliflower vs Broccoli Benefits : కాలీఫ్లవర్ మరియు బ్రకోలీ రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది మంచిదో చూద్దాం. కాలీఫ్లవర్ తో పోలిస్తే పోషక విలువలు బ్రకోలీ లోనే ఎక్కువగా ఉన్నాయి. కాలీఫ్లవర్ రుచి కొంచెం తీపి రుచిలో ఉంటుంది.
అదే బ్రకోలీ రుచి కాస్త తక్కువగా ఉంటుంది. ఈ రెండింటినీ కూరగా చేసినప్పుడు ఆ తేడా తెలియదు. కాలీఫ్లవర్ మరియు బ్రకోలీ రెండింటిలోను తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఈ రెండింటినీ తినవచ్చు. కాలీఫ్లవర్ lo తక్కువ కేలరీలు ఉండుట వలన బరువు తగ్గాలనే ప్రణాళిక ఉన్నవారికి మంచిది.
బ్రకోలీలో పోలేట్ ఎక్కువగా ఉండుట వలన గుండె ఆరోగ్యానికి అవసరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. బ్రకోలీలో కాల్షియం
కూడా ఎక్కువగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ మరియు బ్రకోలీ రెండింటిలోను మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది.
అయితే బ్రకోలీలో మాంగనీస్ ఎక్కువగా ఉండుట వలన ఎముకల సాంద్రతను నిర్మించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆర్థరైటిస్ మరియు ఇతర ఎముకలకు సంబందించిన సమస్యలతో బాధపడేవారికి బ్రకోలీ మంచిది. కాలీఫ్లవర్ కంటే బ్రకోలీలో ఉన్న మరొక ప్రయోజనం ఏమిటంటే, డిటాక్స్ ప్రక్రియలో సహాయపడే ఫైటోన్యూట్రియెంట్స్ బ్రకోలీలో ఉంటాయి.
ఇది చాలా తక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది శరీరానికి అవసరమైన పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌ను కూడా కలిగి ఉంటుంది. మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన స్థూల పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఒక కప్పు వండిన బ్రకోలీలో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటే…ఒక కప్పు వండిన కాలీఫ్లవర్ లో 2.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
ఇక కేలరీల విషయానికి వస్తే ఒక కప్పు వండిన బ్రకోలీలో 44 కేలరీలు ఉంటే…ఒక కప్పు వండిన కాలీఫ్లవర్ లో 29 కేలరీలు ఉంటాయి. ఇక కాలీఫ్లవర్ మరియు బ్రకోలీలో ఏది ఆరోగ్యానికి మంచిది…అనే విషయానికి వస్తే రెండు కూడా మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రెండింటినీ తినటానికి ప్రయత్నం కెఃయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.