2 ఖర్జూరాలను ఇలా తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాన పొట్ట ప్లాట్ గా మారుతుంది
Dates Weight Loss Tips In Telugu : ఈ మధ్యకాలంలో మారిన జీవన శైలిలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మోనోపాజ్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వంటి అనేక రకాల కారణాలతో బరువు పెరగడమే కాకుండా పొట్ట కూడా బానలా తయారవుతుంది.

ఈ పొట్టను తగ్గించుకోవడానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ప్రతి రోజు రెండు ఖర్జూరాలను ఈ విధంగా తీసుకుంటే చాలా మంచి ఫలితం కనబడుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూను శొంఠి పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు రెండు ఖర్జూరాలని తీసుకుని నిలువుగా కట్ చేసి వాటిలో ఉండే గింజలను తొలగించాలి. పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో కూర్చాలి. ఈ స్టఫ్డ్ ఖర్జూరాలను ప్రతిరోజు ఉదయం తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగి బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

స్టఫ్డ్ ఖర్జూరాలను తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు కరగడమే కాకుండా కంటి చూపు పెరుగుతుంది. అంతేకాకుండా రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. చర్మం యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది.

స్టఫ్డ్ ఖర్జూరాలను ఎక్కువగా తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ రెమెడీలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు శరీరంలో కొవ్వును కరిగించటానికి మరియు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాన పొట్ట ప్లాట్ గా మార్చటానికి చాలా బాగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

