Healthhealth tips in telugu

జామకాయలో ఉండే విత్తనాలను తింటే ఏమి అవుతుందో తెలుసా…అసలు నమ్మలేరు

Guava Seeds benefits : జామ కాయ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. జామ కాయను పేదవాని ఆపిల్ అని పిలుస్తారు. తక్కువ ధరలో యాపిల్ లో ఉండే పోషక విలువలు అన్ని ఉంటాయి. జామకాయ తినేటప్పుడు వాటిలో గింజలు అంటే విత్తనాలు ఉంటాయి కదా..వాటిని తినవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది.
jamakaya
జామకాయ విత్తనాలలో కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ విత్తనాలలో ఫైబర్ సమృద్దిగా ఉండటం వలన మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేయటమే కాకుండా జీర్ణ క్రియ బాగా జరిగేలా చేసి బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
cholesterol reduce foods
చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జామకాయ విత్తనాలలో ఉండే పాలిఫినాల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొలగించి కణాలను రక్షిస్తాయి.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వృద్ధాప్య ఛాయ‌ల‌ను ఆలస్యం చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. జామకాయలో ఉండే విత్తనాలను తినవచ్చు. వీటితో ఎలాంటి హానీ క‌ల‌గదు. ఇవి పూర్తిగా సుర‌క్షిత‌మే. జామకాయ లేదా పండులో ఉండే విత్తనాలను ఎటువంటి అనుమానం లేకుండా తినండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.