Devotional

వినాయకచవితి రోజు పాలవెల్లికి ఏ పండ్లను కట్టాలి… ఆ పండ్లను ఏమి చేయాలో…?

vinayaka chavithi palavelli : వినాయకచవితి రోజు వినాయకుడికి పూజ చేసుకుంటే విఘ్నాలు ఏమి రాకుండా ఉంటాయని అందరి నమ్మకం. అందుకే చదువుకొనే పిల్లలు,వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు ఈ వినాయకచవితి పండుగను జరుపుకుంటారు. వినాయకచవితి పూజలో పాలవెల్లి చాలా ముఖ్యమైనది.

పాలవెల్లికి పండ్లను ఎవరికీ ఇష్టం వచ్చినట్టు కడుతూ ఉంటారు. అయితే ఏ పండ్లను ఏ స్థానంలో కడితే ఏ లాభం కలుగుతుందో తెలుసుకుందాం. ముందుగా పాలవెల్లిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పాలవెల్లి మధ్యలో మొక్క జొన్న, వరి, అరటి పండు ,సీతాఫలం, మామిడి పండ్లు,బత్తాయి,దానిమ్మ పండు వంటి వాటిని కట్టాలి.

వినాయకచవితి తొమ్మిది రోజులు చేసేవారు ఆ పండ్లను కాలువలో నిమజ్జనం చేయవచ్చు. వినాయకచవితి ఒక రోజే చేసే వారు ఆ పండ్లను తినవచ్చు. చాలా మంది ఈ పండ్లను దిష్టి తీసిన పండ్లగా భావిస్తారు. అయితే అది మంచి పద్దతి కాదు. మన ఇంటిలో పూజ చేసుకున్నాక మరో ముగ్గురి ఇళ్లకు వెళ్లి వినాయకుని మండపాలను దర్శించాలి.

వినాయకచవితి పూజలో కుడుములు పత్రి చాలా ముఖ్యమైనవి. వినాయకునికి పూజ చేసిన పత్రిని కాలువలో కలపాలి. వినాయక చవితి పండగ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా వీటిని పాటించాలి.