Devotional

వినాయక చవితి పూజకు అవసరమైన పూజ సామాగ్రి ఇవే…!

Vinayaka Puja samagri Details :మనం ఏదైనా పూజలు చేసినప్పుడు మొదటిగా వినాయకుణ్ణి పూజిస్తాం. ఆలా పూజిస్తే చేసే పనిలో ఎటువంటి విఘ్నాలు రావని ప్రగాఢ నమ్మకం. అలాగే వినాయకుడు చదువులకు అధిపతి. అందువల్ల చదువుకొనే పిల్లలు కూడా జ్ఞానాన్ని ప్రసాదించమని ఈ పూజను తప్పనిసరిగా చేసుకుంటారు. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వినాయకచవితిని జరుపుకుంటారు. అయితే ఈ వ్రతానికి అవసరమైన పూజ సామాగ్రి గురించి తెలుసుకుందాం.

పసుపు 50 గ్రాములు
వినాయకచవితి రోజు మట్టి వినాయకుడితో పాటు పసుపు వినాయకుడిని కూడా చేయాలి. అయితే పసుపు వినాయకుణ్ణి ముందుగా తయారుచేయకూడదు. పూజకు అన్ని సిద్ధం చేసుకున్నాక పసుపు వినాయకుణ్ణి తయారుచేసుకొని బొట్టు పెట్టి తమలపాకులో పెట్టి మట్టి వినాయకుణ్ణి దగ్గర పెట్టాలి.

కుంకుమ 50 గ్రాములు

విడి పువ్వులు పూజ చేయటానికి

తమలపాకులు 10

వక్కలు 5

ఎండు ఖర్జురమ్ 100 గ్రాములు

అగరబత్తీ ఒక పేకెట్

కర్పూరం ఈ రోజు ముద్ద కర్పూరం వెలిగిస్తే మంచిది

చిల్లర కాయిన్స్ 5

మామిడి ఆకులు గుమ్మానికి తోరణం కట్టటానికి మరియు పూజలోకి

అరటిపండ్లు 12

పాలవెల్లి 1

పంచామృతం అంటే పాలు,పెరుగు,తేనే,నెయ్యి,పంచదార వీటి అన్నింటిని కలిపితే పంచామృతం అవుతుంది.

యాలకులు వినాయకునికి 21 యలకులతో దండ వేయాలి. వినాయకచవితి తర్వాతి రోజు 21 యలకులను వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ యలకులను పిల్లలకు పెడితే మంచి తెలివితేటలు కలిగి చదువులో ముందడుగు వేస్తారు.

బెల్లం పసుపు వినాయకునికి నైవేద్యం కోసం

పాలవెల్లికి కట్టటానికి మొక్కజొన్నలు ,వెలగ పండ్లు ,సీతాఫలం పండ్లను సిద్ధం చేసుకోవాలి

5 రకాల పండ్లు

కలశం

బియ్యం 2 కేజీ

కొబ్బరికాయలు 2 ఒక కొబ్బరికాయ కలశం మీద పెట్టటానికి, రెండో కొబ్బరికాయ వినాయకునికి నైవేద్యం పెట్టటానికి

టవల్ 1

బ్లౌజ్ పీసెస్ 2

యజనోపవీతం 1

ఉండ్రాళ్ళు వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టాలి

వినాయకుని ప్రతిమ మట్టి వినాయకుడు అయితే మంచిది

దీపం కుందేలు 2

గంట

హారతి పళ్లెం

నెయ్యి లేదా నూనె అరలీటరు

అగ్గిపెట్టె 1

వినాయకుని వ్రతంలో అతి ముఖ్యమైనది పత్రి

1. మాచీ పత్రం/మాచ పత్రి

2. బృహతీ పత్రం/ములక

3. బిల్వ పత్రం/మారేడు

4. దూర్వా పత్రం/గరిక

5. దత్తూర పత్రం/ఉమ్మెత్త

6. బదరీ పత్రం/రేగు

7. అపామార్గ పత్రం/ఉత్తరేణి

8. తులసీ పత్రం/తులసి

9. చూత పత్రం/మామిడి

10. కరవీర పత్రం/గన్నేరు

11. విష్ణుక్రాంత పత్రం

12. దాడిమీ పత్రం/దానిమ్మ

13. దేవదారు పత్రం

14. మరువక పత్రం/

15. సింధువార పత్రం/వావిలి

16. జాజి పత్రం/జాజిమల్లి

17. సీతాఫలం

18. శమీ పత్రం/జమ్మి

19. అశ్వత్థ పత్రం/రావి

20. అర్జున పత్రం/మద్ది

21. అర్క పత్రం/జిల్లేడు.

వినాయకచవితి రోజు ఎవరైతే 21 రకాల పత్రితో పూజిస్తారో వారు చేసిన సమస్త పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా వినాయక చవితి పూజకు అవసరమైన పూజా సామగ్రిని  ముందుగానే సిద్దం చేసుకోవాలి.