Healthhealth tips in telugu

ఈ పండును ఎప్పుడైనా తిన్నారా…ఈ పండులో ఉన్న ఆ రహస్యం తెలిస్తే…అసలు వదలరు

jeedimamidi Fruit Benefits in telugu : జీడి మామిడి పండును మీరు ఎప్పుడైనా తిన్నారా…ఈ పండులో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పండును cashew apple అని ఇంగ్లీష్ లో పిలుస్తారు. అయితే జీడిగింజల ఉత్పత్తికి ప్రధాన కారణంగా ఉన్న జీడి మామిడి పండ్లను మాత్రం పెద్దగా పట్టించుకోరు.
Jidi Mamidi pandu
జీడి పండుకు చివర తొడిగే మొగ్గ జీడి గింజ. ఈ గింజలోనే జీడిపప్పు ఉంటుంది. జీడి పప్పులో కన్నా జీడి పండులోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. వాటిలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే మంచి రంగు, రుచి, ఘాటైన వాసన కలిగి వున్న జీడిమామిడి పండు తినగానే గొంతులో ఒక రకమైన జీర వస్తుంది.
cashew fruit
అందుకే చాలామంది దీనిని తినడానికి ఆసక్తిని చూపించరు. ఒకటి, రెండు రోజులకు మించి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేని పండు కావడం, త్వరగా కుళ్లిపోయే స్వభాగం కలిగివుండంతో జీడిమామిడి పండ్లు ఎక్కువగా తోటల్లో రాలిపోతూ, భూమిలోనే కలిసి పోతున్నాయి. ఈ పండ్లలో కొద్దిగా పిండి పదార్ధాలతో పాటు ఫాస్పరస్, ఐరన్,జింక్, కెరోటిన్, విటమిన్-సి, పొటాషియం, పీచు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలూ ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో జింక్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి శరీరంలోకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదా హానికరమైన బ్యాక్టిరియాలు,వైరస్‌ చేరకుండా కాపాడుతుంది. సీజన్ లో లభించే జీడి పండ్లను తింటే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.
Weight Loss tips in telugu
ఈ పండులో ఉండే ప్రోయాంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కండరాలు, కణజాల రక్షణకు మరియు కండరాలను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గాలని అనుకొనే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
eye sight remedies
ఈ పండులో అధికస్థాయిలో లూటిన్, జియాక్సంతిన్ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా కంటి శుక్లం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పండును తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.