Healthhealth tips in telugu

రాత్రి సమయంలో అన్నం తింటున్నారా…అయితే ఈ విషయాన్ని తెలుసుకోవలసిందే

Rice And Chapati : మనలో చాలా మంది ప్రధాన ఆహారంగా అన్నమును తీసుకుంటూ ఉంటాం. బియ్యం తక్కువ ధరకే లభించటం మరియు ఏ కూరతో అయినా తినటానికి వీలుగా ఉంటుంది. అందువల్ల కొంత మంది మూడు పూటల అన్నం తింటూ ఉంటారు. కష్టపడి పనిచేసేవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

కానీ శారీరక శ్రమ తక్కువగా ఉండే వారిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పగటి సమయంలో అన్నం తింటే త్వరగా జీర్ణం అయ్యిపోతుంది. రాత్రి సమయంలో అయితే జీర్ణం కావటానికి సమయం పడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో తినకుండా ఉంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు.
Pepper rice benefits in telugu
అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన ‌అధిక బరువుతో పాటు కొవ్వు శాతం కూడా పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట అన్నం తీసుకోవ‌డం రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అందువల్ల రాత్రి సమయంలో అన్నం తినటానికి బదులు చపాతీ తింటే మంచిదని నిపుణులు అంటున్నారు.

అన్నం కంటే గోధుమ పిండిలో ప్రొటీన్ నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అన్నంలో కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది. అలాగే గోదుమల్లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన నిదానంగా అరుగుతుంది. దాంతో తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది.
Diabetes diet in telugu
బియ్యంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. అయితే గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు రక్తంలో నిదానంగా కలుస్తాయి. చ‌పాతీలు చేసే గోధుమ పిండిలో ఐరన్ పుష్క‌లంగా ఉంటుంది.ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.