Healthhealth tips in telugu

మధ్యాహ్న భోజనం తర్వాత బెల్లం,నెయ్యి కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో…అసలు నమ్మలేరు

jaggery and ghee Benefits In telugu :బెల్లం, నెయ్యి రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నెయ్యిని పాల నుండి తయారు చేస్తే బెల్లాన్ని చెరుకు రసం నుండి తయారు చేస్తారు. ఈ రెండింటిలో ఉన్న ప్రయోజనాలు మనకు తెలుసు. కానీ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధను బలపరుస్తుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగ నిరోదక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. రక్తహీనత సమస్య ఉన్న వారికి చాలా బాగా సహాయపడుతుంది. ఐరన్ సమృద్ధిగా ఉండే బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తొలగిపోతుంది.
jaggery Health benefits in telugu
డయాబెటిస్ తో బాధపడే వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అయితే చాలా లిమిట్ గా తీసుకోవాలి.ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటివి కూడా తగ్గుతాయి.
Jaggery Health Benefits in Telugu
ఆయుర్వేదం ప్రకారం, బెల్లం మరియు నెయ్యి కలిపి తీసుకుంటే శరీరం నిర్విషీకరణకు సహాయపడుతుంది. అంతేకాక మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్లు B మరియు C ఉంటాయి. నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు మరియు A, E, మరియు D వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

అంతేకాకుండా, ఇందులో విటమిన్ K కూడా ఉంటుంది, ఇది కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత ఒక స్పూన్ నెయ్యిలో బెల్లం కలిపి తీసుకుంటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే బెల్లం కొనేటప్పుడు ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే మంచిది. ఆర్గానిక్ బెల్లం ముదురు రంగులో ఉంటుంది. అదే కెమికల్స్ కలిపిన బెల్లం అయితే పసుపురంగులో ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.