Healthhealth tips in telugu

ఈ ఆకులు అందరికి తెలుసు…కానీ ఈ ఆకులలో ఉన్న ఆ రహస్యం ఎవరికి తెలియదు

pomegranate leaves benefits In Telugu : దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దానిమ్మ ఆకులో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. దానిమ్మ ఆకును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.
Best home remedy for Mouth Ulcers in Telugu
దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. నోటి పూత ఉన్నప్పుడు దానిమ్మ ఆకుల రసంను నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటి పూత నుండి ఉపశమనం కలుగుతుంది. దానిమ్మ ఆకులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు, గొంతునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి పది దానిమ్మ ఆకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే దగ్గు నుండి ఉపశమనం మరియు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
sleeping problems in telugu
దానిమ్మ ఆకుల కాషాయన్ని రాత్రి పడుకొనే ముందు తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో దానిమ్మ ఆకుల పేస్ట్ రాస్తే తొందరగా తగ్గుతాయి. eczema ను కూడా తగ్గిస్తుంది. దానిమ్మ ఆకుల పేస్ట్ మొటిమలను తగ్గించటమే కాకుండా ఒక టోనర్ వలె పనిచేస్తుంది.
gas troble home remedies
దానిమ్మ ఆకులలో ఉండే పోషకాలు మరియు ఖనిజాలు జీర్ణక్రియను ప్రేరేపించడంలో సహాయపడతాయి. దాంతో గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. దానిమ్మ ఆకుల రసాన్ని దానిమ్మ జ్యూస్ లో కలుపుకొని కూడా తాగవచ్చు. దానిమ్మ ఆకులను ఉపయోగించి ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.