Healthhealth tips in telugu

ఈ జ్యూస్ తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు….ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి…

Maredu Fruit Benefits In Telugu : మారేడు ఫలం ఆరోగ్యపరంగా మనకు ఎన్నో ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన ఫలంగా చెప్పవచ్చు. చేదుగా ఉంటుందని చాలా మంది మారేడు ఫలాన్ని తినటానికి ఇష్టపడరు. కానీ మారేడు ఫలం చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఈ పండు తీసుకోవడానికి ఇష్టపడతారు.
Maredu Pandu
ఈ పండు ఫ్రెష్ గా దొరికినప్పుడు జ్యూస్ గా తయారు చేసుకుని తీసుకోవచ్చు…లేదంటే మారేడుఫలం పౌడర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో అర స్పూన్ మారేడుఫలం పొడి వేసి బాగా కలిపి తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఫలం ఒక అద్భుతమైన ఫలం అని చెప్పవచ్చు.
Diabetes diet in telugu
కౌమారిన్స్ బీటా సేల్స్ ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఉదయం సమయంలో మారేడుఫలం తీసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. మారేడు ఫలంలో ఫినాయిల్, ఆల్కలైడ్స్,ఫ్లావానోడ్స్, ప్యాటి యాసిడ్స్,ఆర్గానిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
Weight Loss tips in telugu
ఇవన్నీ శరీరంలో వైరస్ లేదా బ్యాక్టీరియా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చంపేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు మారేడుఫలం అద్భుతం అని చెప్పవచ్చు. వీటిలో ఉండే టేనిన్స్ అనేవి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.
cholesterol reduce foods
మారేడు పండులో ప్రోటీన్స్‌, కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉన్నాయి. జీర్ణ సంబంద సమస్యలు అయినా గ్యాస్,,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కడుపులో నులి పురుగులను నిర్మూలిస్తుంది. ఒత్తిడి,తలనొప్పి ఉన్నప్పుడూ ఈ జ్యూస్ తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.