Healthhealth tips in telugu

ఈ టీ తాగితే తలనొప్పి,ఒత్తిడి,ఆందోళన, డిప్రెషన్ క్ష‌ణాల్లో తగ్గి ప్రశాంతంగా ఉంటారు

stress herbal tea In Telugu : ఒత్తిడి అనేది మన శరీరం మొత్తం మీద ప్రభావాన్ని చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడి ప్రభావం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాక ఒత్తిడి కారణంగా కోపం, బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు దారితీస్తాయి. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది.
Health Benefits Of Eating Pudina
ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో టీ తయారుచేసుకొని తాగితే ఒత్తిడి నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది వయస్సుతో సంబందం లేకుండా ఒత్తిడికి గురి అవుతున్నారు.
Ginger Tips In Telugu
ఈ సమస్య చిన్నగా అనిపించినా సరే దాని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక పది పుదీనా ఆకులు, ఒక స్పూన్ అల్లం తురుము,పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ పసుపు, ఒక యాలక్కాయను చితక్కొట్టి వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి.
Black Pepper Benefits
మరిగిన ఈ టీని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ టీని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ టీ మెదడు మ‌రియు శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అంతేకాక తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. పుదీనా ఒత్తిడిని తగ్గించటానికి బాగా సహాయపడుతుంది.

పుదీనాలో ప్రధానంగా కన్పించేది మెంథాల్ (Menthol). ఇది మెదడులోని కార్టిసాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ టీలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడతాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ టీని తయారుచేసుకొని తాగి ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.