Healthhealth tips in telugu

ఈ పొడి జ్ఞాప‌క శ‌క్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది

Improve brain health Powder In Telugu: ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ కారణంగా అలాగే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడటం వలన అవి మెదడు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తి అనేవి బాగుంటాయి.
saraswati Plant
అందువల్ల మెదడు పనితీరు బాగుండేలా మెదడుకు అవసరమయ్యే పోషకాలు అందే విధంగా చూసుకోవాలి. మెదడు చురుగ్గా పనిచేసే జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా అలాగే మతిపరపు సమస్యలు లేకుండా చేయటానికి ఒక పొడిని తయారు చేసుకుందాం. ఈ పొడి కోసం ఒక బీట్రూట్ తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి తురుముకోవాలి.

తురిమిన బీట్రూట్ ను ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి. బాగా ఎండిన బీట్రూట్ ను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వీలు కానీ వారు మార్కెట్లో బీట్రూట్ పొడి దొరుకుతుంది…అది కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇంటిలో తయారు చేసుకున్న పొడి అయితే మంచిది.
ఆ తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక కప్పు వేరుశనగలు వేసి వేగించాలి.
peanuts side effects
వేగిన వేరుశనగలపై పొట్టు తీసేసి మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక కప్పు బీట్రూట్ పొడి, ఒక కప్పు వేరుశనగల పొడి, ఒక కప్పు బెల్లం పొడి వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలిపి డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఈ పొడి దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది.
Brain Foods
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ పొడిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అయ్యి మతిమరుపు వంటివి ఉండవు. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా ఈ పొడి చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత లేకుండా చేస్తుంది. .
blood thinning
అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ పొడిని వాడితే బరువు తగ్గుతాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ పొడిని తయారుచేసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.