1 లడ్డు తింటే శరీరంలో బలహీనత,రక్తహీనత,Calcium లోపం అనేవి అసలు ఉండవు
Calcium Rich Laddu In Telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవటం,ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలతో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఇప్పుడు చెప్పే లడ్డు ప్రతి రోజు తింటే సరిపోతుంది.

మన శరీరానికి అవసరమైన పోషకాలు అందితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇక లడ్డు తయారీ కోసం…నెయ్యి దాదాపుగా 250 గ్రాములు అవసరం అవుతుంది. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి అరకప్పు edible gum వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల నూనె వేసి రెండు కప్పుల lotus seeds వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసి అరకప్పు జీడిపప్పు, అరకప్పు బాదం పప్పు,పావు కప్పు పిస్తా పప్పు, పావుకప్పు కిస్ మిస్ వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరల రెండు స్పూన్ల నెయ్యి వేసి పావు కప్పు పుచ్చ గింజలు, పావుకప్పు నువ్వులు, పావుకప్పు Poppy Seeds, అరకప్పు ఎండుకొబ్బరి వేసి బాగా వేగించి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసి పావుకప్పు శనగపిండి, రెండు కప్పుల గోదుమ పిండి వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో వెగించిన edible gum, Lotus సీడ్స్, జీడిపప్పు,బాదం పప్పు, పిస్తా పప్పు,కిస్ మిస్, పుచ్చ పప్పు,నువ్వులు,Poppy seeds, ఎండుకొబ్బరి వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వేగించి పెట్టుకున్న శనగ పిండి ,గోదుమ పిండిని వేయాలి. ఆ తర్వాత 250 గ్రాముల బెల్లన్ని తీగ పాకం వచ్చేలా పాకం పట్టి ఆ మిశ్రమంలో పోసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ శొంఠి పొడి, ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి లడ్డూలు తయారుచేసుకోవాలి.

ప్రతి రోజు ఒక లడ్డు తింటే అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉంటారు. రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. శారీరక బలహీనత తగ్గుతుంది. Calcium లోపం కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ లడ్డూను తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

