Healthhealth tips in telugu

వీటిని ఇలా తీసుకుంటే 15 రోజుల్లో థైరాయిడ్ సమస్య కంట్రోల్‌…ముఖ్యంగా ఆ సమస్యలు ఉండవు

Thyroid Foods In Telugu : థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ మూడు ఆహార పదార్థాలను తీసుకుంటే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక రెక్కల వలె కనిపించే మెడ బాగంలో చిన్న గ్రంథి. థైరాయిడ్ హార్మోన్లు గ్రంథి నుండి విడుదలవుతాయి. శరీరంలోని కణాలకు రక్తం ద్వారా ప్రయాణిస్తాయి.
Thyroid remedies
దీని కారణంగా శరీరం అభివృద్ధి చెందుతుంది, ఎముకల నిర్మాణం, లైంగిక అభివృద్ధి జరుగుతుంది. అలాగే శరీరం యొక్క అనేక విధులు నియంత్రించబడతాయి. ఈ గ్రంధి శరీరానికి అవసరమైన హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు లేదా దానిని ఉత్పత్తి చేయలేనప్పుడు థైరాయిడ్ వ్యాధి వస్తుంది.

థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల చేయడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. చాలా తక్కువ లేదా హార్మోన్ విడుదల లేకుండా ఉండటాన్ని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మందులను తప్పనిసరిగా వాడాలి. ధైరాయిడ్ ని నియంత్రణలో ఉంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.
Is pista good for diabetes In Telugu
పిస్తా పప్పు ధైరాయిడ్ నియంత్రణలో సహాయపడుతుంది. పిస్తాలో ఫైబర్, ఖనిజాలు,ప్రోటీన్ మరియు సంతృప్త కొవ్వులు సమృద్దిగా ఉంటాయి. రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం, ఆకలి లేకపోవడం, నిద్రలేమి మరియు ఒత్తిడి వంటి థైరాయిడ్ లక్షణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
brazil nuts
రోజుకు కేవలం 2-3 బ్రెజిల్ నట్స్ తినడం వల్ల శరీరంలో సెలీనియం స్థాయిలు మెరుగుపడతాయి. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సెలీనియం అవసరం. బ్రెజిల్ నట్స్ తినడం వలన అన్ని రకాల థైరాయిడ్ వ్యాధులను నివారించడంలో మరియు నిర్వహించడంలో సహాయపడుతుంది.
Health Benefits of Dates
ఖర్జూరం థైరాయిడ్‌కు ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. ఇందులో అయోడిన్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం తినడం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. 3 నుండి 4 ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినవచ్చు…లేదంటే నానబెట్టకుండా కూడా తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.