Healthhealth tips in telugu

పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Garlic Health benefits In Telugu : వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనలో చాలా మంది వెల్లుల్లిని ప్రతి రోజు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికి పచ్చి వెల్లుల్లి తీసుకొనే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లి నిజానికి ఒక ఆయుర్వేద మూలిక. ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది.
garlic Health benefits
మానవ శరీరంలోని రక్తపోటును నియంత్రించడమే కాకుండా, అనేక వ్యాధులను నయం చేసే గుణం దీనికి ఉంది. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వస్తాయి. పచ్చి వెల్లుల్లిని నోటిలో నమలడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది.

వెల్లుల్లి వాసన ఎక్కువ సేపు ఉండటం వలన ఎవరితోనైనా మాట్లాడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెల్లుల్లి గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేస్తుందనేది ఎంత నిజమో, దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు మరింతగా వస్తాయని కూడా నిజం. విపరీతమైన గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వెల్లుల్లిని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి.
gas troble home remedies
గుండెల్లో మంట పెరిగి చివరికి ఛాతీలో అల్సర్లకు దారితీస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. వెల్లుల్లికి వేడి చేసే గుణం ఉండుట వలన విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినే వ్యక్తులు ఛాతీ కుహరంలో మంట మరియు చికాకును అనుభవించవచ్చు. అలాంటి సమస్య ఎసిడిటీ వల్ల వస్తుంది.
Acidity home remedies
ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారిలో ఇలాంటి సమస్యలు సర్వసాధారణం. కాబట్టి గ్యాస్ సమస్యతో బాధపడేవారు అసలు పచ్చి వెల్లుల్లిని అసలు తినకూడదు. ప్రతి రోజు రెండు వెల్లుల్లిని ఉడికించి తీసుకోవచ్చు….లేదంటే రాత్రి సమయంలో రెండు వెల్లుల్లిని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగవచ్చు…లేదంటే రెండు వెల్లుల్లిని క్రష్ చేసి నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.