Healthhealth tips in telugu

ఈ పండును ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

Amarfal fruit benefits In Telugu : మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి. మంచి పోషకాలు ఉన్న పండ్లలో అమర్‌ఫల్ (Amarfal) పండు ఒకటి. దీనిని ఇంగ్లీష్‌లో పెర్సిమోన్ (Persimmon) అంటారు. ఇది చైనా, జపాన్ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది.
Immunity foods
అమర్‌ఫల్ వల్ల కలిగే ప్రయోజనాల కారణంగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్లలో కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ పండులో విటమిన్ ఎ సమృద్దిగా ఉండుట వలన కంటికి మంచిది. అలాగే విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. అలాగే విటమిన్ E, K మరియు B1, B2, B6 ఫోలేట్‌లతో పాటు, పొటాషియం, రాగి, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ కూడా ఉన్నాయి.
Weight Loss tips in telugu
మొత్తంమీద ఈ పండును సహజ మల్టీవిటమిన్‌గా చెప్పవచ్చు. బరువు తగ్గే ఆలోచనలో ఉన్నవారికి ఈ పండు బాగా సహాయపడుతుంది. ఈ పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేయటమే కాకుండా…కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది.

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన DNA దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. అలాగే ఫ్లేవనాయిడ్స్ మరియు క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ పండులో పొటాషియం సమృద్దిగా ఉంటుంది.

పొటాషియం వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది. రక్తపోటును తగ్గించే ఏజెంట్. శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. తక్కువ రక్తపోటు, హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి మరియు వివిధ గుండె సంబంధిత పరిస్థితులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.