కిడ్నీ సంబంధిత సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ,కొలెస్ట్రాల్ తగ్గించే ఈ ఆకుకూరను ఎప్పుడైనా తిన్నారా..?
Bachali kura Benefits In Telugu : బచ్చలి ఆకు ఎక్కువగా పల్లెటూర్లలో కనిపిస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ ఎ,బి,సి, ఐరన్ క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వారంలో రెండు సార్లు ఈ ఆకుకూరను తీసుకుంటే మంచిది.
బచ్చలి ఆకులో ఉన్న పోషకాలు కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సంబంధిత సమస్యలు,కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. అలాగే ఇందులో ఉండే రెటినోల్ కంటి కండరాల బలహీనతను తగ్గించి కంటి చూపు పెరగటానికి మరియు వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
బచ్చలికూర ఆహారంగా తీసుకోవటం వల్ల రక్త ప్రవాహాం మెరుగవుతుంది. రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించటంలో సైతం ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మెదడు డ్యామేజి కాకుండా కాపాడతాయి. క్యాల్షియం సమృద్ధిగా ఉండటం వలన కీళ్లనొప్పులు లేకుండా చేస్తుంది.
ఇందులోని పీచు జీర్ణశక్తిని పెంచి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడే వారు బచ్చలి కూర తినటం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఆసమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేయటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు వారానికి మూడుసార్లు ఈ కూరను తీసుకోవటం ఆరోగ్యపరంగా మంచిది.
బచ్చలి కూరలో విటమిన్-ఏ, లుటిన్, కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన మెదడు నిర్మాణాత్మక, క్రియాత్మక నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బచ్చలి కూరను తప్పనిసరిగా ఆహారంలో బాగంగా చేసుకోవాలి. రసం లేదా స్మూథీ రూపంలో బచ్చలికూరను ఆహారంలో తీసుకోవడం వల్ల అధికమోతాదులో పోషకాలు లభిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.