Healthhealth tips in telugu

ఈ జావ తాగితే…డయబెటిస్,అధిక బరువు,నీరసం,అలసట లేకుండా రోజంతా జోరుగా హుషారుగా ఉంటారు

Ragi Java Benefits In telugu : రాగి జావ అనేది మనలో చాలా మంది వేసవికాలంలో తాగితే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుందని భావిస్తారు. కానీ ఏ కాలంలో తీసుకున్న మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. రాగి జావలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు మరియు మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
finger millet In Telugu
ఫైబర్,అమైనో ఆమ్లాలు,పాలిపినాల్స్ సమృద్దిగా ఉండుట వలన డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే రాగుల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక బరువును తగ్గించుకొనే ప్రణాళికలో ఉన్న వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి.
Joint Pains
ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది. గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి మరిగించాలి. రెండు స్పూన్ల రాగి పిండిని గిన్నెలో వేసి నీటిని పోసి బాగా కలిపి మరిగిన నీటిలో పోసి 5 నిమిషాల పాటు మరిగించి, కొంచెం ఉప్పు వేసి కలిపి పొయ్యి మీద నుంచి దించాలి.
Is Ragi Good for Diabetes
చల్లారాక మజ్జిగ కలుపుకొని తాగాలి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. ఉదయం సమయంలో తాగితే రోజంతా జోరుగా హుషారుగా ఉంటారు. ఇలా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాము. రాగి పిండితో రొట్టెలు కూడా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.