Beauty Tips

కలబందలో ఇది కలిపి రాస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Hair Fall Home remedies in telugu : ఈ సీజన్లో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తలలో తేమ తగ్గి జుట్టు పొడిగా మారడం, చుండ్రు,జుట్టు రాలిపోవడం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు.

మనలో చాలామంది కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూడవచ్చు.

రాత్రి సమయంలో ఒక బౌల్ లో అర కప్పు బియ్యం వేసి గ్లాసు నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నానబెట్టిన బియ్యం నుంచి నీటిని సపరేట్ చేయాలి. ఈ నీటిలో ఒక స్పూన్ అలోవెరా జెల్. ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టేలా స్ప్రే చేయాలి. .

ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే పొడి జుట్టు సమస్య, చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ రెమిడిలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తాయి.
hair fall tips in telugu
కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కా ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. మార్కెట్ లో దొరికే కలబంద జెల్ కాకుండా ఇంటిలో ఉండే కలబంద నుండి జెల్ చేస్తే మంచిది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి ఈ రెమిడీని ఫాలో అయ్యి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.